ఇప్పుడు ఒక్క ఇండియన్ సినిమా మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా భారీ అంచనాలు ఉన్న కాంబో మూవీ ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల సినిమా అని చెప్పుకోవాలి. మరి మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కిస్తుండగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఫైనల్ గా మొదలు కాబోతుంది.
అయితే తాజాగా జక్కన్న పోస్ట్ చేసిన మరో పోస్ట్ ఇపుడు వైరల్ అవుతుంది. గతంలో పోస్ట్ చేసిన సింహం పిక్ ని మహేష్ బాబుతో తను అభివర్ణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సింహంని ఇప్పుడు జైల్లో లాక్ వేసినట్టుగా పాస్ పోర్ట్ చూపించి క్రేజీ పోస్ట్ ని తను చేశారు.
దీంతో ఇక మహేష్ ని జక్కన్న బంధించేశారు అని అభిమానులు అంతా అనుకుంటున్నారు. మొత్తానికి అయితే ఈ సెన్సేషనల్ సినిమా కోసం ఇపుడు మళ్లీ చర్చ స్టార్ట్ అయ్యింది.
The post మినింగ్ ఏంటి చెప్పు జక్కన్న! first appeared on Andhrawatch.com.