‘మిస్ యు’ ఓటీటీ తేదీ ఖరారు! | CineChitram

హీరో సిద్ధార్థ్ నటించిన తాజా సినిమా ‘మిస్ యు’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ 13న మంచి బజ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అయితే, ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ లేకపోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడింది. దర్శకుడు ఎన్.రాజశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీలో అందాల భామ ఆషికా రంనాథ్ హీరోయిన్‌గా చేసింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ‘మిస్ యు’ చిత్రం జనవరి 26 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కి వస్తుందనే వార్తలు వినపడుతున్నాయి.

తమిళ్, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే.

The post ‘మిస్ యు’ ఓటీటీ తేదీ ఖరారు! first appeared on Andhrawatch.com.

About

Check Also

Paradha Teaser: Anupama Parameswaran Shines in Rustic Drama | CineChitram

Director Praveen Kandregula is back after the success of Cinema Bandi with a new and …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading