టాలీవుడ్‌లో ‘బొమ్మరిల్లు’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించిన సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కొన్ని సినిమాలే చేసినా, ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ అయితే కలిగించాడు. తన యాక్టింగ్‌తో పాటు సింగింగ్‌తోనూ సాలిడ్ గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల వరుసగా సినిమాలు చాలా సెలెక్టివ్‌గా చేస్తూ సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, సిద్ధార్థ్ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘‘మిస్ యూ’’ అంటూ తన కొత్త సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు ఈ యంగ్ రో. ఇక ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించగా రాజశేఖర్ ఈ సినిమాను తెరెక్కెక్కించాడు.
గిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. అయితే, ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 23న సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి అయితే మొదలైంది.
The post ‘మిస్ యూ’ అంటూ వస్తున్న సిద్దార్థ్! first appeared on Andhrawatch.com.