ముందు అనుకున్న కథ ఇది కాదు! | CineChitram

ప్రస్తుతం మన సౌత్ నుంచి ఉన్న పలు క్రేజీ కాంబో సినిమాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్, యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్ కనగరాజ్ కాంబోలో చేస్తున్న సాలిడ్ మల్టీస్టారర్ సినిమా “కూలీ” కూడా ఒకటి. మరి భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని లోకేష్ శరవేగంగా ఆ నటులతో ఆయన రూపొందిస్తున్నాడు.

అయితే రజినీ లోకేష్ కాంబోలో సినిమా అనగానే ఒక్కసారిగా అంచనాలు ఊహించని రీతిలో పెరిగి  పోయాయి. అయితే ఈ సినిమా విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి ఇపుడు తాజాగా బయటకు వచ్చింది. దీంతో అసలు రజినీకాంత్ కోసం లోకేష్ ముందు అనుకున్న కథే వేరే కథ అట. కానీ అది డెవలప్ చేసే సమయంలో లోకేష్ కొంచెం ఒత్తిడికి గురి కావడంతో కథ అది కాకుండా కూలీ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టుగా చెప్పారు

అయితే ఈ స్క్రిప్ట్ కి కూడా లోకేష్ కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నాడని తెలుస్తుంది. అలాగే గతంలో కూడా రజినీకి స్క్రిప్ట్ రాయడం చిన్న విషయం కాదని అది ఒత్తిడితో కూడుకున్నదే అని చెప్పుకొచ్చాడు. ఇపుడు ఈ టాక్ వైరల్ అవుతుంది.

The post ముందు అనుకున్న కథ ఇది కాదు! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …