ముగ్గురు పిల్లలు కావాలి! అందాల భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం నార్త్‌లోనే కాకుండా సౌత్‌లోనూ ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా అయిపోయింది. ఆమె తెలుగు ప్రేక్షకులకు ‘దేవర’ చిత్రంతో దగ్గర అయిపోయింది. ఇక జాన్వీ తరుచూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉండటం కూడా తెలుగు ప్రేక్షకులకు ఆమెను మరింత దగ్గర చేసింది.
కాగా, ఆమె ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన RC16 మూవీలో నటిస్తోంది. అయితే, తాజాగా జాన్వీ కపూర్ తన పెళ్లి, పిల్లలు పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. బాలీవుడ్‌లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ ఈ మేరకు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పెళ్లి చేసుకుని తన భర్తతో తిరుపతి నగరంలో ఉండిపోవాలని తనకు ఉందని.. ముగ్గురు పిల్లల్ని కనాలని.. అటుపై అరిటాకులో భోజనం పెట్టుకుని గోవింద నామస్మరణతో తినాలని తన కోరిక అంటూ చెప్పుకొచ్చింది. ఇక తన భర్తను లుంగీ వేసుకోమని తాను చెబుతానని జాన్వీ తెలిపింది. ఇలా తన పెళ్లి, పిల్లలు, జీవితంపై జాన్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
The post ముగ్గురు పిల్లలు కావాలి! first appeared on Andhrawatch.com.