మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘ఎల్2: ఎంపురన్’ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన ‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ రూపుదిద్దుకుంది.. ఈ సినిమాను స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఓ సాలిడ్ అప్డేట్‌ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ సినిమా టీజర్‌ను జనవరి 26న గ్రాండ్ లాంచ్ చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను జనవరి 26న కొచ్చిలో సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాలో టొవినో థామస్, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
The post ముహుర్తం కుదిరింది! first appeared on Andhrawatch.com.