మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ చిత్రం “విశ్వంభర” చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ గ్యాప్ లో ఇంకో ఊహించని వరల్డ్ రికార్డు అది కూడా తన డాన్స్ విషయంలో ఆయన సొంతం చేసుకున్నారు. గిన్నీస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారన్న వార్త అభిమానులను మరింత ఎగ్జైట్ చేసింది.
అయితే ఈ అవార్డు వేడుకకి గాను బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ అమీర్ ఖాన్ కూడా హాజరై చిరంజీవికి గిన్నీస్ వరల్డ్ రికార్డు పురస్కారాన్ని అందించారు. అయితే ఈ సందర్భంలో అమీర్ ఖాన్ చేసిన స్టేట్మెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. చిరంజీవి గారు ఈ ఈవెంట్ కోసం మిగతా ఎవరినీ ఎంచుకోకుండా నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో మొదట అర్ధం కాలేదని… కానీ చిరంజీవి గారు నన్ను అడగాల్సిన పనిలేదు మీరు నాకు ఆర్డర్ వేసినా తప్పకుండా వచ్చేసేవాడిని అంటూ అమీర్ లాంటి స్టార్ హీరో చెప్పడం విశేషం.
మెగాస్టార్ రేంజ్ బాలీవుడ్ హీరోస్ లో ఏపాటిదో మనం అర్ధం చేసుకోవచ్చు. దీంతో చిరు విషయంలో అమీర్ ఖాన్ స్టేట్మెంట్ వైరల్ అవుతుంది.
The post మెగాస్టార్ గురించి అమీర్ ఖాన్ ఏమన్నాడంటే! first appeared on Andhrawatch.com.