గ్లోబల్ స్టార్,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’ మూవీ విడుదల కోసం రెడీ అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కించగా, బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
అయితే, రామ్ చరణ్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టనున్నట్లు సమాచారం తెలుస్తోంది. దర్శకుడు బుచ్చి బాబు సానా డైరెక్షన్‌లో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీలో చరణ్ నటించనున్నట్లు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా లాంచ్ కూడా చేశారు. అయితే, నవంబర్ 22 శుక్రవారం రోజున ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని మూవీ మేకర్స్ మొదలు పెట్టబోతున్నారంట.
ఇప్పటికే ఈ సినిమా కోసం చరణ్ కొత్తగా మేకోవర్ ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చరణ్ పక్కన జత కట్టేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది.అంతేకాకుండా వ్రిద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
The post మొదలు పెట్టేస్తున్నాడు! first appeared on Andhrawatch.com.