మ్యాజిక్’ తో మళ్లీ స్టార్ట్ చేస్తాం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ ‘మ్యాజిక్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే, ఈ సినిమా విడుదలను కొన్ని కారణాల వల్ల వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి నిర్మాత నాగవంశీ ఓ సాలిడ్ అప్డేట్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ‘మ్యాజిక్’ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారని.. ఇప్పటికే ఆయన 6 పాటలు కంపోజ్ చేశారని.. మరో పాట చిత్రీకరించాల్సి ఉందని.. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పాటలను ఒకేసారి విడుదల చేస్తామని.. గతంలో జ్యూక్‌బాక్స్ రూపంలో ఆడియో పాటలన్నీ ఒకేసారి విడుదల చేసేవారని.. ఇప్పుడు మ్యాజిక్ చిత్రంతో ఆ ట్రెండ్ మళ్లీ స్టార్ట్ చేస్తామని నాగవంశీ చెప్పారు.
The post ‘మ్యాజిక్’ తో మళ్లీ స్టార్ట్ చేస్తాం first appeared on Andhrawatch.com.