ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా పలు సినిమాలు లైన్ లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. అలాగే రీసెంట్ గానే జపాన్ లో తన భారీ చిత్రం దేవర జపాన్ రిలీజ్ కి అక్కడికెళ్లి సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ తర్వాత తారక్ మళ్ళీ హైదరాబాద్ కి చేరుకున్నాక ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వడం కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది.
తన దేవర సినిమా ప్రీరిలీజ్ వేడుకలు ఎలాగో చేసుకోలేదు కానీ లేటెస్ట్ గా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం మ్యాడ్ స్క్వేర్ విజయోత్సవ వేడుకలకి తాను రావడం ఆల్రెడీ కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ సక్సెస్ మీట్ తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ లోనే తన సోదరుడు కళ్యాణ్ రామ్ లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ప్రీరిలీజ్ కోసం తాను గెస్ట్ గా రానున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఇది వరకే దీనిపై బజ్ వచ్చింది కానీ ప్రస్తుతం న్యూస్ కన్ఫర్మ్ అన్నట్టుగా టాక్. దీనితో నందమూరి అభిమానులకి డబుల్ ట్రీట్ అని చెప్పవచ్చు.
The post మ్యాన్ ఆఫ్ మాసెస్ డబుల్ ట్రీట్! first appeared on Andhrawatch.com.