యో..చూసుకోబళ్లా…జాగ్రత్త సామి..అంటున్న అభిమానులు! | CineChitram

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ దేవర. ఈ సినిమాని ఈ నెల 27 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు మూవీ టీమ్‌ రెడీ అవుతుంది. సినిమా విడుదలకి ఇంకా 15 రోజులు సమయం మాత్రమే సమయం ఉంది. దీంతో మూవీ టీం సినిమా ప్రమోషన్స్‌ మీద ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది.

ఈ క్రమంలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ ముంబై వెళ్లి ట్రైలర్ రిలీజ్ చేసి రావడమే కాక దాదాపు మీడియా సంస్థలతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా తారక్‌  రచ్చ చేస్తున్నాడు. ఒక రెండు మూడు రోజులు ఆగి సౌత్ లో కూడా ప్రమోషన్స్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు. ఆ సంగతి పక్కన పెడితే దేవర సినిమాకి రెండు గంటల 57 నిమిషాల నిడివితో సెన్సార్ పూర్తయినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో ఇంత నిడివితో వచ్చి ప్రేక్షకుల మదిని దోచుకున్న సినిమాలు చాలా తక్కువే ఉన్నాయని చెప్పుకొవచ్చు.

ఒక కమర్షియల్ సినిమాకి ఇది చాలా ఎక్కువ రన్ టైం అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. దానికి తోడు ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అర్థరాత్రి ఒంటి గంటకే ప్రదర్శించేలా ఇప్పటినుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణలో ఎప్పటినుంచో ఈ సంస్కృతి ఉంది. కానీ ఏపీలో గత ఐదు సంవత్సరాలు సినీ పరిశ్రమ వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పరిస్థితులు కాస్త మారినట్లు తెలుస్తుంది.

అదే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను కాస్త టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఒంటిగంటకు అభిమానులు షోస్ వేస్తే వారితో పాటు ఇతర ఆడియన్స్ కూడా వస్తారు. కానీ ఒంటిగంట నుంచి షోస్ పడితే కనుక మూడు గంటల సినిమా నడిచేటప్పటికీ తెల్లవారుజాము నాలుగవుతుంది. అప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ వేరేగా ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దానికి తోడు ఇప్పటికే ఈ సినిమాకి మంచి హైప్‌ ఉన్న సంగతి తెలిసిందే.

దానికి తోడు సోషల్ మీడియాలో అభిమానులతో పాటు కొంతమంది సినీ టెక్నీషియన్లు కూడా ఆ హైప్ ని మరింత పెంచుతున్నారు. ఇంత హైప్ ఉన్న నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటిగంట షోస్ వేయడం ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే ఒకవేళ సినిమా ఏ మాత్రం అంచనాలకు తగ్గట్టుగా లేకపోయినా నెగిటివ్ టాక్ విపరీతంగా బయటికి స్ప్రెడ్ అవుతుంది. సాధారణంగా ఏ ఉదయం 10 గంటల షోకో లేక పదకొండు గంటల షోకో వెళితే అభిమానులు పెద్దగా ఫీల్ అవ్వరు.

కానీ ఒకవేళ అర్ధరాత్రి సినిమాకి వెళ్లి అది ఏ మాత్రం నిరాశపరిచినా నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ అయ్యే విషయంలో దాని ఇంపాక్ట్ డబల్ అవుతుంది. కొరటాల ఇచ్చిన కంటెంట్ మీద నమ్మకం ఉంటే మాత్రమే ఒంటిగంట షోస్కు వెళ్లాలని లేదంటే సైలెంట్ గా ఎర్లీ మార్నింగ్ షోస్ ప్లాన్ చేసుకోవచ్చు అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో సినిమా యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే మరి.

The post యో..చూసుకోబళ్లా…జాగ్రత్త సామి..అంటున్న అభిమానులు! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …