రన్‌ టైమ్‌ ఎంతంటే..! | CineChitram

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘అర్జున్ S/O వైజయంతి’ ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్  చేసి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మరోసారి పూర్తి మాస్ అవతారంలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా, ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

ఏప్రిల్ 18న విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ ఫార్మాలిటీ కూడా పూర్తి అయ్యింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రంలోని తల్లి కొడుకుల మధ్య బాండింగ్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అటు ఇందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు మాస్ ఆడియెన్స్‌ను అలరించబోతున్నాయట.

ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ సీక్వెన్స్ సర్‌ప్రైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 24 నిమిషాలకు లాక్ చేశారు మేకర్స్. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సోహైల్ ఖాన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

The post రన్‌ టైమ్‌ ఎంతంటే..! first appeared on Andhrawatch.com.

About

Check Also

Revanth Reddy Sends Strong Message to MLAs | CineChitram

Telangana Chief Minister Revanth Reddy has warned party MLAs sternly to stay away from lobbying …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading