రికార్డు వసూళ్లు! | CineChitram

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో వినిపిస్తున్న సినిమా పేరు ఏదన్నా ఉంది అంటే అది “ఛావా” అనే చెప్పాలి. స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా సాలిడ్ పాత్రలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ చిత్రం ఒక్క భాషలోనే విడుదల అయ్యి పాన్ ఇండియా వైడ్ వైరల్ గా మారింది.

అయితే ఇండియా వైడ్ గా ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిపోయింది. వీక్ డేస్ లోకి వచ్చినప్పటికీ కూడా స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా నిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కూడా 30 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించి అదరగొట్టింది. అయితే కొన్ని ఏరియాల్లో అయితే డే 1 కంటే నిన్న డే 6 వసూళ్లే ఎక్కువగా రిజిస్టర్ అయ్యాయట.

దీనితో ఛావా హవా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇదే కొనసాగితే ఈ వీకెండ్ కి ఈజీగా 300 కోట్ల నెట్ వసూళ్ల క్లబ్ లో ఈ సినిమా ఒక్క ఇండియా నుంచే చేరిపోతుంది అని చెప్పవచ్చు. అలాగే ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని భారీ వసూళ్లు అందుకుంటుంది అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు వారు చెబుతున్నారు.

The post రికార్డు వసూళ్లు! first appeared on Andhrawatch.com.

About

Check Also

రీమేక్ పనిలో దిల్‌ రాజు బిజీ! | CineChitram

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading