రీల్ అండ్ రియల్! మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన సందర్భానుసారంగా పోస్టులు పెడుతుంటారు. అయితే, మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా చిరు, తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. తన నిజజీవితం, సినీ జీవితంలో తన విజయానికి కారణమైన హీరోయిన్స్‌తో కలిసి చిరు ఓ ఫోటో దిగారు. ఈ ఫోటోలో చిరంజీవి రియల్ లైఫ్ హీరోయిన్, ఆయన సతీమణి సురేఖతో పాటు సినీ లైఫ్ హీరోయిన్లు రాధిక, నదియా, ఖుష్బూ, జయసుధ, మీనా, సుహాసిని, టబూ కనిపిస్తున్నారు. ఇలా తన జీవితంలో విజయానికి ఎంతో ముఖ్యమైన మహిళలతో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఫోటో దిగడం సంతోషంగా ఉందంటూ చిరు ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’’ అంటూ చిరు ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది.
The post రీల్ అండ్ రియల్! first appeared on Andhrawatch.com.