రీవాల్వర్‌ రీటాగా కీర్తి సురేష్‌! | CineChitram

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి టాలీవుడ్‌ కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్వింగులో ఉన్నారు. ఓ వైపు హీరోయిన్ గా గ్లామర్ పాత్రలను చేస్తూనే మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది.  వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనలోని ప్రతిభను చాటుకుంటున్నారు. ఇప్పటికే గుడ్ లక్ సఖి.. మిస్ ఇండియా వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి మంచి మార్కులు వేయించుకున్నారు.

రీసెంట్ గా రఘు తాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రివాల్వర్ రీటా సినిమా కూడా ఒకటి. కన్నడ దర్శకుడు చంద్రు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను.. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాలా నెలల క్రితమే కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. 90స్ లుక్ లో రెండు చేతిలో రివాల్వర్స్ పట్టుకుని కీర్తి సురేష్ కనిపించింది.

కౌ బాయ్ తరహాలో డిజైన్ చేసిన పోస్టర్.. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్‌ అయ్యింది . అయితే కీర్తి పుట్టిన రోజు సందర్భంగా.. రివాల్వర్ రీటా మేకర్స్ విడుదల చేసిన టీజర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆ టీజర్ జనాలను ఆకట్టుకుంటుంది. రివాల్వర్ తో ఆమె ఆడుకుంటూ.. గూండాలకు వణుకు పుట్టిస్తూ కీర్తి సురేష్ కనిపించడంతో రివాల్వర్ రీటా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రివాల్వర్ రీటా మూవీతో మంచి హిట్ అందుకునేలా కనిపిస్తుందని తెలుస్తుంది.

The post రీవాల్వర్‌ రీటాగా కీర్తి సురేష్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Jaipur Court Issues Notices To Shah Rukh Khan, Ajay Devgn, And Tiger Shroff Over Pan Masala Ad   | CineChitram

In a significant legal turn of events, the Jaipur Consumer Disputes Redressal Commission has issued …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading