మెగా యంగ్ అండ్ డెడికేట్ హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా భారీ సినిమా “మట్కా” గురించి అందరికీ తెలిసిందే. మరి టాలెంటెడ్ దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ ఇంట్రెస్టింగ్ గ్యాంగ్ స్టర్ అండ్ గ్యాంబ్లింగ్ డ్రామాగా దీనిని భారీ హంగులతో రూపొందించారు. అయితే ఇప్పుడు వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా మంచి బజ్ ని క్రియేట్ చేసింది.
అలాగే సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా బాగానే ఆకట్టుకుంది. ఇక మేకర్స్ తాజాగా సినిమా రెండో సాంగ్ ని ప్రకటించారు. మరి వరుణ్ తేజ్ అండ్ కొంతమంది లేడీస్ పై తస్సాదియ్యా అంటూ సాగే సాంగ్ ని ఈ అక్టోబర్ 24న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ఈ పోస్టర్ మూడ్ చూస్తుంటే వరుణ్ తేజ్ రోల్ పై సాగేలా కనపడుతుంది. ఇక ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా నవంబర్ 14న సినిమా విడుదల కానుంది.
The post రెండో సాంగ్ కి ముహుర్తం కుదిరింది! first appeared on Andhrawatch.com.