రొమాంటిక్ కామెడీగా సుహాస్ ‘ఓ భామ అయ్యో రామా’ | CineChitram

నటుడు సుహాస్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘ఓ భామ అయ్యో రామా’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను రామ్ గోదాల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఓ  వీడియో గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

‘దేవుడినైనా రాముడినైనా నడిపించేది ఆడదే’ అనే ఇంట్రెస్టింగ్ డైలాగ్‌తో ఈ వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సుహాస్ ఈసారి కొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో అతడి పాత్ర ఎలా ఉంటుందా.. అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాలో మాళవిక మనోజ్ హీరోయిన్‌గా చేస్తుండడంతో సుహాస్‌తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అనే ఆసక్తి సినిమాపై పెంచుతుంది.

ఇక ఈ సినిమాలో ‘నువ్వు నేను’ ఫేం అనితా హస్సానందని ఓ కీలక పాత్రలో చేస్తోంది. ప్రభాస్ శ్రీను, అలీ, రవీందర్ విజయ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు.

The post రొమాంటిక్ కామెడీగా సుహాస్ ‘ఓ భామ అయ్యో రామా’ first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …