టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుల్లో తన సినిమాటిక్ యూనివర్స్ ని పరిచయం చేసి తెలుగు ఆడియెన్స్ కి థియేటర్స్ లో క్రేజీ ఎక్స్ పీరియన్స్ అందించిన వారిలో యువ దర్శకుడు శైలేష్ కొలను కూడా ఒకరు. మరి శైలేష్ నుంచి తన హిట్ ఫ్రాంచైజ్ లో మూడో సినిమా వస్తుంది. నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమాలో మరో స్టార్ నటుడు క్లైమాక్స్ లో కనిపిస్తారు అనే టాక్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యింది. అయితే ఈ సినిమాలో ఆ హీరో ఉన్నాడు అనే లీక్ విషయంలో దర్శకుడు బాగా డిజప్పాయింట్ అయ్యాడు. తను తమ టీం ఎప్పుడూ ఆడియెన్స్ మంచి ట్రీట్ ఇవ్వాలనే అనుకుంటాము అని కానీ దానిని కొంతమంది ముందే ఇలా లీక్ చేసేసి వాటిని చెడగొడుతున్నారు అన్నట్టుగా శైలేష్ పోస్ట్ చేసాడు.
కనీసం ఆలోచన కూడా లేకుండా పోస్ట్ చేయడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ తరహా రిపోర్టింగ్ కేవలం చిత్ర బృంద కష్టాన్ని దొంగిలించడమే కాదు, ప్రేక్షకుల నుండి నేరుగా దొంగిలించడంతో సమానం అంటూ శైలేష్ చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.
The post లీక్స్ తో యంగ్ డైరెక్టర్ నిరాశ! first appeared on Andhrawatch.com.