కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా రష్మికా హీరోయిన్ గా టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “కుబేర” గురించి అందరికీ తెలిసిందే. మరి శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు ఆసక్తికర అప్డేట్స్ ని ఇస్తున్నారు.
అయితే ఇప్పుడు వినాయక చవితి కానుకగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని ధనుష్ అలాగే నాగార్జునపై విడుదల చేశారు. అయితే ఇందులో ధనుష్ వైపు నాగార్జున సీరియస్ గా చూస్తున్న లుక్స్ ఆసక్తి రేపుతుండగా వారి కింద దూరం నుంచి కనిపిస్తున్న ఇల్లు లాంటివి ఉన్నాయి. కానీ దీనిని సరిగా చూస్తే డబ్బు కట్టలతో దానికి వ్యతిరేకంగా ఓ స్లమ్ లాంటి ఏరియా ఇళ్లు కనిపించేలా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇలా సినిమా కాన్సెప్ట్ పై మరింత ఆసక్తి ఈ పోస్టర్ తో రేగుతుంది అని చెప్పుకొవచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా అమిగోస్ సినిమాస్ వారు అలాగే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
The post వచ్చేసింది…వచ్చేసింది! first appeared on Andhrawatch.com.