శృతిహాసన్ ఇప్పటికే ఇద్దరు బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆమె తాజా మాజీ ప్రియుడు శాంతను హజారికాతో నాలుగేళ్ల బంధానికి స్వస్తి చెబుతున్నట్లు శ్రుతి స్వయంగా ప్రకటించింది. ఆ మధ్య కాలంలో ఇంస్టాగ్రామ్ లో అభిమానులు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఆమె సమాధానం ఇస్తూ తాను ప్రస్తుతం సింగిల్ అని మింగిల్ అయ్యే ఇంట్రెస్ట్ కూడా లేదని తెలిపింది.
ఆమె మాటలను బట్టి చూస్తే ఇప్పట్లో ఎవర్ని డేటింగ్ చేయబోదు అని అనుకున్నారు.కానీ ఆమె మరోసారి రిలేషన్ లోకి అడుగు పెట్టే దిశగా పరుగులు పెడుతున్నట్లుగా ఓ టాక్ వినిపిస్తుంది. నిజానికి ఆమె కెరీర్ మీద పూర్తి ఫోకస్ చేస్తున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం ఆమె ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ కూలి సినిమాలో యాక్ట్ చేస్తుంది.
ఇక ఈ సినిమాలో రజనీకాంత్ కూతురు పాత్రలో శృతిహాసన్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. అయితే ఆమె మరోసారి రిలేషన్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే అది ప్రచారమేనా? నిజంగానే ఆమె మరో రిలేషన్ లో అడుగుపెడుతుందా? అనే విషయం మీద మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
The post వద్దు..వద్దంటూనే మరోసారి ప్రేమలోకి! first appeared on Andhrawatch.com.