వరుణ్‌ తో సమంత కెమిస్ట్రీ అదిరింది! | CineChitram

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్‌ ధావన్‌ – సమంత జంటగా నటించిన వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ-బన్నీ’. కాగా ఈ సిరీస్ ప్రీమియర్‌ ను లండన్‌ లో తాజాగా ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌ లో సిటాడెల్‌ నిర్మాత మాట్లాడుతూ.. వరుణ్‌, సమంతల నటనపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నిర్మాత గినా గార్డి మాట్లాడుతూ.. ‘ఇది సిటాడెల్‌ గ్లోబల్‌ ఈవెంట్ లాంటిది. నేను ఈ సిరీస్ ఇండియన్‌ వెర్షన్‌ను చూసి ఆశ్చర్యానికి గురయ్యాను. మొదటి ఎపిసోడ్‌ను ఎన్నిసార్లు చూశానో తెలియదు. నిజంగా వరుణ్‌, సమంత తమ పాత్రల్లో జీవించేశారు’ అంటూ గినా గార్డి చెప్పుకొచ్చారు.

గినా గార్డి మాట్లాడుతూ.. ‘వరుణ్‌ ధావన్‌ – సమంత మధ్య కెమిస్ట్రీ నాకు బాగా నచ్చింది. వారిద్దరి మధ్య బాండింగ్ అంత అద్భుతంగా పండింది. అలాగే, వరుణ్‌ ధావన్‌ – సమంత పాత్రల్లో ఊహించని ట్విస్ట్‌లు కూడా సూపర్‌ ఉన్నాయి. రాజ్‌ అండ్‌ డీకేలంటే నాకెంతో అభిమానం. వాళ్ల ప్రాజెక్టులన్నీచాలా  భిన్నంగా ఉంటాయి. నేను కూడా ఇందులో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ గినా కామెంట్స్ చేశారు. మొత్తానికి వరుణ్‌ ధావన్‌ – సమంత మధ్య కెమిస్ట్రీ పై కామెంట్స్ చేయడంతో ఈ స్పీచ్ వైరల్ అవుతుంది.

The post వరుణ్‌ తో సమంత కెమిస్ట్రీ అదిరింది! first appeared on Andhrawatch.com.

About

Check Also

Manchu Vishnu Adopts 120 Orphans in Tirupati, Celebrates Sankranti with Them | CineChitram

Actor Manchu Vishnu has garnered widespread appreciation for his philanthropic gesture of adopting 120 orphans …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading