మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ‘మట్కా’ అనే పాన్ ఇండియా మూవీని ఆయన తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా, పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక ఈ సినిమా పూర్తి కాకముందే, మరో దర్శకుడు మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో ఓ సినిమాను ఓకే చేశాడు వరుణ్ తేజ్. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కమెడియన్ సత్య కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
ఇటీవల ‘‘మత్తు వదలరా 2’’ మూవీలో తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి మంచి మార్కులే అందుకున్నాడు సత్య. ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాలోనూ దాదాపు ఇలాంటి పాత్రే ఉంటుందని.. ఇది కూడా ఫుల్ లెంగ్త్ రోల్‌గా మూవీ మేకర్స్ చెబుతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో మొదలవ్వనున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ సినిమా రాబోతుంది.
The post వరుణ్ మూవీ క్రేజీ కాంబో! first appeared on Andhrawatch.com.