వాడిని ఏమాంటారో తెలుసా! | CineChitram

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తాజా బ్లాక్ బస్టర్ సినిమా ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకుపోతుంది.

ఈ సందర్భంగా టీం విజయ వేడుక నిర్వహించింది. నిర్మాత దిల్ రాజు, దర్శకులు హను రాఘవపూడి, శివ నిర్వాణ, రాహుల్ సంకృత్యాన్ అతిధులుగా హాజరయ్యారు. ఈ విజయ వేడుకలో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఈ రోజు ఇక్కడికి వచ్చిన నా పెద్ద ఫ్యామిలీకి ..లవ్ యూ ఆల్. థాంక్ యు సో మచ్. ఈ వేడుక చూస్తుంటే మనసు నిండిపోయింది. చుట్టూ వరదలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద హిట్‌ చేశారు. సినిమా సక్సెస్ అవుతుందని నమ్మాను

ఆ నమ్మకాన్ని నిజం చేసి చూపించారు. వివేక్ సిక్ అయిన సమయంలో  నేను కూడా రెండు రోజులు అసిస్టెంట్ డైరెక్టర్ లా పని చేశా. ఈ విజయం తెలుగు ప్రేక్షకులది. సరిపోదా శనివారం సక్సెస్ వివేక్ అకౌంట్ లో నే వేసేస్తున్నాను. జెర్సీలో అర్జున్ సక్సెస్ ఐతే సత్య రాజ్ ఎంత ఆనందపడతారో వివేక్ సక్సెస్ చూసి నేను అలానే ఆనందంపడుతున్నాను. మళ్ళీ కలసి పని చేసినప్పుడు కామెడీ తీద్దాం. ఆడియన్స్ సీట్లో పడిపడి నవ్వాలి. అది నా కోరిక. ఎస్జే సూర్య గారి పెర్ఫార్మెన్స్ ని ఒక ప్రేక్షకుడిలా ఫుల్ ఎంజాయ్‌ చేశాను అంటూ నాని పేర్కొన్నాడు.

శనివారం మాత్రమే రెచ్చిపోయేవాడిని శనివారమోడు అంటారు. సినిమా నచ్చితే రోజూ రెచ్చిపోయేవాళ్ళని తెలుగు ప్రేక్షకులు అంటారు. థాంక్ యూ సో మచ్’ అని పేర్కొన్నాడు.

The post వాడిని ఏమాంటారో తెలుసా! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …