టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తమ టాలెంట్ తో మంచి షైన్ అవుతూ వచ్చిన యువ హీరోస్ లో చిన్న పాత్రలతో మొదలు పెట్టి ఇప్పుడు హీరోగా సాలిడ్ హిట్స్ తో ముందుకు దూసుకెళ్తున్న నటుడు సుహాస్ కూడా ఒకరని చెప్పుకొవచ్చు. మరి సుహాస్ ఆల్రెడీ ఈ ఏడాది సాలిడ్ థ్రిల్లర్ “ప్రసన్నవదనం” తో మంచి హిట్ ని అందుకోగా ఈ చిత్రం తర్వాత తాను హీరోగా సంగీర్తన విపిన్ హీరోయిన్ గా చేసిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమే “జనక అయితే గనక”.
దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ లతో మంచి ప్రామిసింగ్ ఎంటర్టైనర్ అన్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ సెప్టెంబర్ 7న విడుదల కి ప్లాన్ చేశారు. అలాగే పైడ్ ప్రీమెయిర్స్ ని కూడా పెట్టారు. కానీ ఇప్పుడు ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టుగా తెలిపారు.
ప్రస్తుతం వర్షాల మోత కారణంగా ఏర్పడ్డ వరదలు వీటి మూలాన తమ నవ్వులని వాయిదా వేస్తున్నామని కొత్త డేట్ తో అతి త్వరలోనే రిలీజ్ కి వస్తామని మేకర్స్ తెలిపారు. మరి త్వరలోనే ఈ కొత్త డేట్ పై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
The post వాయిదా పడ్డ సుహాస్ తాజా చిత్రం! first appeared on Andhrawatch.com.