డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ల తర్వాత తన కొత్త సినిమాని విజయ్ సేతుపతి హీరోగా పూరి ప్రకటించాడు. ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ టబు ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ కూడా యాక్ట్ చేస్తుందంట. హీరోయిన్ రాధిక ఆప్టేను ఓ ముఖ్య పాత్ర కోసం తీసుకోబోతున్నారట. రాధిక ఆప్టే పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.
పైగా సినిమాలోని పాత్రలన్నీ చాలా వేరియేషన్స్ తో సాగుతాయట. మొత్తానికి పూరి ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. అన్నట్టు జూన్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కాబోతుంది. ఐతే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో పూరి, విజయ్ సేతుపతి కోసం బలమైన కథను రాశాడట.
The post విజయ్ సేతుపతి మూవీలో రాధిక! first appeared on Andhrawatch.com.