విడుదల ఎప్పుడంటే! | CineChitram

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్‌ చేస్తున్న తాజా సినిమా  ‘గేమ్ ఛేంజర్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా, ఇప్పటివరకు కేవలం ఫస్ట్ సింగిల్ సాంగ్ మాత్రమే ఈ సినిమా నుండి బయటకు వచ్చింది.

 దీంతో అభిమానులు ఈ సినిమా నుంచి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్న థమన్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఒకటి ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన నెక్స్ట్ సాంగ్ అప్డేట్స్ వచ్చే వారం నుంచి వస్తాయని ఆయన ప్రకటించారు.

అంతేగాక, ఈ సినిమా బీజీఎం స్కోర్ పనులు అక్టోబర్ 1 నుంచి మొదలు అవుతున్నాయని.. డిసెంబర్ 20న థియేటర్లలో రీసౌండ్ రావాల్సిందే అని ఆయన చెప్పారు.  దీంతో ‘గేమ్ ఛేంజర్’ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. డిసెంబర్ 20న ఈ సినిమా రావడం ఖాయమని.. ఇక ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్స్ కూడా రెడీ చేస్తున్నారని తెలిసింది.

ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య, అంజలి, శ్రీకాంత్ తో పాటు మరి కొంత మంది నటులు ముఖ్య పాత్రల్లో చేస్తున్నారు.

The post విడుదల ఎప్పుడంటే! first appeared on Andhrawatch.com.

About

Check Also

JAILER 2 – Announcement Teaser | CineChitram

The post JAILER 2 – Announcement Teaser first appeared on Andhrawatch.com.

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading