గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చిత్రం యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం అనౌన్సమెంట్ నుంచి మొన్న ఫస్ట్ లుక్ పోస్టర్స్ వరకు సాలిడ్ హైప్ ని అందుకోగా ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి ఇపుడు ఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాని ఈ ఏడాది రిలీజ్ కే మేకర్స్ ప్లాన్ చేశారు.
కానీ ఓటిటి డీల్స్ మూలాన వచ్చే ఏడాది షిఫ్ట్ అయినట్టుగా టాక్ వచ్చింది. ఇక దీనితో రెండు డేట్స్ పెద్ది కోసం వినిపిస్తున్నాయి. ఈ టాక్ ప్రకారం మార్చ్ 20 లేదా ఏప్రిల్ మొదటి వారంలో అలా పెద్ది రాక ఉంటుంది అని తెలుస్తోంది. అలాగే రేపు రానున్న గ్లింప్స్ తోనే రిలీజ్ డేట్ ఏంటి అనేది రివీల్ కావచ్చట. మరి ఈ అవైటెడ్ స్పోర్ట్ డ్రామా ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
The post విడుదల తేదీ పై కొత్త టాక్! first appeared on Andhrawatch.com.