టాలీవుడ్ లెజెండరీ పద్మవిభూషణుడు మెగాస్టార్ చిరంజీవి కథానాయికగా, త్రిష హీరోయిన్ గా, యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ మూవీ “విశ్వంభర” గురించి అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత చిరు నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ హైప్ నెలకొంది. అయితే ఈ సినిమా పనులు అన్నీ శరవేగంగా పూర్తి జరుగుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా వశిష్ట పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. విశ్వంభర రిలీజ్ డేట్ జనవరి 10, 2025ని పెట్టి విశ్వంభర విజృంభణ, ఆగమనం అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో మెగా ఫ్యాన్స్ అయితే వశిష్ట కాన్ఫిడెన్స్ చూసి ఆనందం వ్యక్తం చేస్తూ విశ్వంభరుడి ఆగమనం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
The post “విశ్వంభర” విజృంభణ కు అంతా సిద్దం! first appeared on Andhrawatch.com.