డైరెక్టర్ వి.వి. వినాయక్ గత కొన్నేళ్లుగా సైలెంట్ అయిపోయారు. ఎట్టకేలకు ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టనున్నారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు మళ్లీ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వెంకీకి వినాయక్ ఓ కథ చెప్పాడని, వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ లో నిజం ఎంత ఉందో గానీ, వినాయక్ సినిమా పై మాత్రం ఎప్పటి నుంచో ఎన్నో రూమర్లు మాత్రం షికార్లు చేస్తూనే ఉన్నాయి.
అన్నట్టు ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి నిర్మించొచ్చని సినీ వర్గాలంటున్నాయి. ఈ ముగ్గురి కాంబోలో 2006లో వచ్చిన ‘లక్ష్మీ’ సూపర్ హిట్టు అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య వినాయక్ సక్సెస్ బాటలో నడవలేదు. కాబట్టి.. ఎలాగైనా సక్సెస్ ను అందుకోవాలనే కసితో వినాయక్ తన తర్వాత సినిమా కోసం పని చేస్తున్నట్లు టాక్ వినపడుతుంది. మరి, వెంకటేష్ ఇమేజ్ కోసం వినాయక్ ఎలాంటి కథ రాశాడో వేచి చూడాలి. అన్నట్టు ఆ మధ్య వినాయక్, బాలయ్యతో కూడా సినిమా చేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే వినాయక్, వెంకీతో సినిమాని ప్లాన్ చేస్తున్నాడు.
The post వెంకీతో వినాయక్! first appeared on Andhrawatch.com.