వేరే లెవల్‌ అంతే! | CineChitram

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రశ్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే.

మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సీక్వెల్ మన ఇండియన్ సినిమా దగ్గర మరో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ జాబితాలో చేరిపోయింది. అయితే ఈ సినిమా పనులు అన్నీ సూపర్‌ ఫాస్ట్‌ గా జరిగిపోతున్నాయి.

ఇంకో పక్క బిజినెస్ లెక్కలు అంటూ భారీ నంబర్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇలా పుష్ప 2 కోసం పాన్ ఇండియా మార్కెట్ లో ఓ రేంజ్ లో వార్తలు వినపడుతున్నాయి. మరి లేటెస్ట్ గా ఆన్లైన్ సినిమా బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో పుష్ప రాజ్ తన రూల్ ఓ రేంజ్‌ లో చూపిస్తున్నాడని తెలుస్తుంది.

బుక్ మై షో అలాగే పే టి ఎం లలో కలిపి ఏకంగా 7 లక్షల ఇంట్రెస్ట్స్ ని పుష్ప 2 నమోదు చేసింది. ఇంకా సినిమా విడుదలకి చాలా సమయం ఉన్న గ్యాప్ లోనే ఈ రేంజ్ సెన్సేషన్ ని చూపించడం వేరే లెవల్‌ అంతే. మొత్తానికి పుష్ప గాడి రూలు ఏ లెవెల్లో ఉందో తెలుసుకోవచ్చు.

The post వేరే లెవల్‌ అంతే! first appeared on Andhrawatch.com.

About

Check Also

దేసీ రాజ్ మాస్‌ గ్లింప్స్! | CineChitram

టాలీవుడ్‌ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా సినిమా ‘ఘాటి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు పెంచేసింది. ఈ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading