కొత్త నటీనటులు రుత్విక్, ఇక్రా ఇద్రిసి ప్రధాన పాత్రల్లో రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సినిమా “వైభవం”. యువ ప్రతిభాశాలి సాత్విక్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలోని ‘పల్లె వీధుల్లోన’ పాటను మేకర్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.
మరి చిన్ననాటి జ్ఞాపకాలను, తల్లిదండ్రుల ప్రేమను, స్వచ్ఛమైన స్నేహాన్ని, పల్లె వైభవాన్ని గుర్తుచేసే ఈ పాటకు దర్శకుడు సాత్విక్ స్వయంగా సాహిత్యాన్ని, బాణీలను అందించాడు. రితేష్ జి రావు పాడారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని, రానున్న రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.
The post వైభవం నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది! first appeared on Andhrawatch.com.