తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ED) భారీ షాక్ ఇచ్చింది. శంకర్‌కు చెందిన ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. శంకర్‌కి చెందిన రూ.10.11 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జప్తు చేసింది. శంకర్ తెరకెక్కించిన ‘రోబో’ సినిమా కేసులో భాగంగా ఈడీ ఈ జప్తు చేసింది.
శంకర్ తెరకెక్కించిన రోబో సినిమా కథను ఆయన కాపీ కొట్టారని 2011లో తమిళ రచయిత ఆరూర్ తమిళ్‌నందన్ కేసు వేశారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఆరూర్ కథకు, రోబో కథకు పోలికలు ఉన్నాయని.. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది.
కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 63ను శంకర్ ఉల్లంఘించారని ఈడీ వెల్లడించింది. కాగా, రోబో సినిమా కోసం రూ.11.5 కోట్ల రెమ్యూనరేషన్‌ను శంకర్ తీసుకున్నారని.. ప్రపంచవ్యాప్తంగా రోబో సినిమా రూ.290 కోట్లు వసూలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
The post శంకర్ ఆస్తులు జప్తు! first appeared on Andhrawatch.com.