శౌర్యాంగ పర్వం నుంచి క్రేజీ లీక్‌! | CineChitram

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాసస్‌ చేతినిండా భారీ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్నాడు. మరి ఈ సినిమాల్లో కొన్ని సినిమాలు క్రేజీ సీక్వెల్స్‌ కూడా ఉన్నాయి. వాటిలో  దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ యాక్షన్ సీక్వెల్ చిత్రం “సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం” సినిమా కూడా ఒకటి.

మరి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ కొంతమేర ఎప్పుడో ప్రశాంత్ నీల్ కంప్లీట్‌ చేసేశాడు. మిగిలిన షూట్ ఇంకా పూర్తి  చేయాల్సి ఉండగా ఈ సినిమా విషయంలో ఓ క్రేజీ లీక్ గురించి ఇప్పుడు వైరల్ గా మారింది. సలార్ 2 లో టన్నెల్ ఫైట్ సీక్వెన్స్ అంటూ కొన్ని క్లిప్స్, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరి ఇది చూసి రెబల్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. పార్ట్ 1 లో కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ కంటే ఇది ఎంతో వైలెంట్ గా ఉంటుంది అని ఆల్రెడీ ఓ టాక్ అయితే వినిపిస్తుంది. మొత్తానికి అయితే ఇది సలార్ 2 పై మరిన్ని అంచనాలు పెంచేసింది అని చెప్పుకొవచ్చు.

The post శౌర్యాంగ పర్వం నుంచి క్రేజీ లీక్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Manchu Vishnu Adopts 120 Orphans in Tirupati, Celebrates Sankranti with Them | CineChitram

Actor Manchu Vishnu has garnered widespread appreciation for his philanthropic gesture of adopting 120 orphans …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading