షూటింగ్‌ లో గాయపడ్డ హృతిక్‌! | CineChitram

షూటింగ్‌ లో గాయపడ్డ హృతిక్‌! ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ బాలీవుడ్ మూవీ ‘వార్-2’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తుండగా హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్ షూట్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. అయితే ఈ సాంగ్ షూట్ రిహార్సల్స్‌లో హీరో హృతిక్ రోషన్ గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన కాలికి గాయమైందని చిత్ర యూనిట్ చెబుతోంది. దీంతో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు కొంతమేర రెస్ట్ తీసుకోవాలని సూచించారు.

ఇప్పుడు ఈ సాంగ్ షూట్ కొద్దిరోజుల పాటు వాయిదా వేస్తారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాను ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది.

The post షూటింగ్‌ లో గాయపడ్డ హృతిక్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

ప్రమోషన్స్‌ షూరూ చేసిన భైరవం టీం! | CineChitram

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘భైరవం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విజయ్ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading