ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న చిత్రాల్లో మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు భాను బోగవరపు పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఈ మూవీలోని ‘తూ మేరా లవర్’ అంటూ ఓ పెప్పీ మాస్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. కాగా, ఈ పాటను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తుండగా.. ఈ సాంగ్ ప్రోమోను ఏప్రిల్ 12న మధ్యాహ్నం 12.06 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ పాటలో యంగ్ బ్యూటీ శ్రీలీలతో కలిసి మరోసారి డ్యాన్‌తో షేక్ చేసేందుకు మాస్ రాజా రెడీ అవుతున్నాడు.
The post షేక్ చేయబోతున్న మాస్ రాజా! first appeared on Andhrawatch.com.