టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇపుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు అనీల్ రావిపూడితో చేయనున్న సాలిడ్ ఎంటర్టైనర్ కూడా ఒకటి. చిరంజీవి కెరీర్లో 157వ సినిమాగా మేకర్స్ నేడు ఉగాది పర్వదినం సందర్భంగా అట్టహాసంగా సినిమాని లాంచ్ చేశారు. అయితే వీరి కలయికలో సినిమా ఉంది అనుకున్నప్పుడు నుంచే మంచి బజ్ ఈ చిత్రంపై ఏర్పడింది.
ఇక చిరంజీవిని ఒక సాలిడ్ ఎంటర్టైనర్ లో చూసి కూడా చాలా ఏళ్ళు కావడంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో అనీల్ మరియు వెంకీ మామలు అదరగొడితే ఇపుడు చిరంజీవి మాత్రం ‘సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం’ అంటున్నారు. దీనితో తన పోస్ట్ మంచి వైరల్ గా మారింది. సంక్రాంతికి వస్తున్నాం తరహాలోనే మంచి క్యాచీ టైటిల్ గా ఉంది కానీ ఇదైతే టైటిల్ కాదు వచ్చే సంక్రాంతికి రిలీజ్ ని కన్ఫర్మ్ చేసేసారు. ఇక ఈ సినిమాపై మరిన్ని అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది.
The post సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం! first appeared on Andhrawatch.com.