సంతోషాలే…సంతోషాలు! న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన మూవీ ‘కోర్ట్’. ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే, ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాకి బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
పైగా సినిమా బాగుంది అంటూ చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో కోర్ట్ చిత్రబృందం తమ సంతోషాన్ని తెలియజేస్తూ అందరూ కలిసి నవ్వుతూ ఫోటో దిగారు. ఆ ఫోటోను న్యాచురల్ స్టార్ నాని తన ఎక్స్ ఎకౌంట్ లో పోస్ట్ చేస్తూ.. తమ కోర్టు సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ పిక్స్ తో పాటు ఓ మేసేజ్ ను కూడా పోస్ట్ చేశారు.
‘ఈ సంతోషకరమైన ముఖాలకు కారణమైన మీలో ప్రతి ఒక్కరికీ..’ ధన్యవాదాలు అన్నట్టు నాని మేసేజ్ ను పోస్ట్ చేశారు. ఇక ఈ ఫోటోలో నానితో పాటు ప్రియదర్సి, హర్ష్ రోషన్, శ్రీదేవిలతో పాటు దర్శకుడు రామ్ జగదీష్ కూడా ఉన్నాడు. మరో ఫోటోలో కోర్ట్ సినిమాలో జంటగా నటించిన హర్ష్ రోషన్, శ్రీదేవి కలసి నానితో ఫోటో దిగారు. ఈ ఫోటో కూడా ఆకట్టుకుంటుంది. కాగా కోర్టు సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేయగా విజయ్ బుల్గనిన్ సంగీతం అందించారు.
The post సంతోషాలే…సంతోషాలు! first appeared on Andhrawatch.com.