బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “సికందర్”. అయితే ఈ ఈద్ కానుకగా రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం సల్మాన్ కెరీర్లో మరో డిజప్పాయింట్ సినిమాగానే మిగలాల్సి వచ్చింది. అయితే అనౌన్స్ చేసినపుడు ఉన్న అంచనాలు ఈ సినిమా విడుదల సమయానికి మాత్రం లేవు. దీనితో డల్ గానే రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా.. కంటెంట్ పరంగా తేలిపోవడంతో అది మరింత మైనస్ గా మారింది.
అయితే మొదటి నుంచీ డల్ గా ఉందనే మాట అటుంచితే నార్త్ లో సైతం సల్మాన్ సినిమాని ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. హిందీలో కూడా పలు చోట్ల ఇవాళ రిలీజ్ అయినప్పటికీ థియేటర్స్ సగం ఖాళీగానే దర్శనం ఇస్తున్నాయట. దీనితో అసలు సల్మాన్ సినిమాకి ఈ పరిస్థితి ఏంటని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సికందర్ మూవీతో పాటు సల్మాన్ పరిస్థితి కూడా దారుణంగానే ఉన్నాయి.
The post సల్మాన్ పరిస్థితి దారుణం! first appeared on Andhrawatch.com.