స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ డ్రామా మూవీగా రానుంది. ఇక ఈ సినిమాలో సిద్ధు స్టైలిష్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.
కాగా, ఈ సినిమా నుంచి ఇప్పుడు ఓ సాలిడ్ ట్రీట్‌ను అందించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ‘హు ఇజ్ పాబ్లో నెరుడా’ అంటూ తన స్వాగ్‌లో స్వింగ్ చేయించేందుకు సిద్ధు రెడీ అవుతున్నాడు. ఈ ట్రీట్‌ను త్వరలోనే అందించనుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.
దీంతో ఈ ట్రీట్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
The post సాలిడ్ ట్రీట్! first appeared on Andhrawatch.com.