టాలీవుడ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ చివరిసారిగా టిల్లు స్క్వేర్ చిత్రంలో కనిపించి అందర్ని అలరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తరువాత పలు చిత్రాలకి సిద్దు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్ అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ సినిమాలో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలయ్యింది. ఈ షెడ్యూల్ లో హీరోతో పాటుగా, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, నరేష్ లు కూడా పాల్గొన్నట్లు సమాచారం.
సెప్టెంబర్ మూడో వారం నుండి నేపాల్ లో తదుపరి షెడ్యూల్ మొదలు కానుంది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ పై ప్రస్తుతం అందరిలో ఆసక్తి నెలకొంది.
The post సిద్ధు బాయ్ “జాక్” మూవీ తాజా సమాచారం! first appeared on Andhrawatch.com.