పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న భారీ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. అయితే ఒక సాలిడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా దీనిని ప్లాన్ చేస్తుండగా మొదట్లో అభిమానులు ఈ సినిమా పట్ల పలు భిన్నమైన అభిప్రాయాలే వ్యక్తం చేసినా మేకర్స్ నెమ్మదిగా ఫ్యాన్స్ ని తమ వైపు తిప్పుకున్నారు.
అయితే ది రాజా సాబ్ విషయంలో రీసెంట్ గా ఒక ఇంట్రెస్టింగ్ రూమర్స్ బయటకి వచ్చాయి. దీనితో ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుంది అని టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాకి కూడా సీక్వెల్ అవసరం ఉందా? ఇప్పటికే ప్రభాస్ నుంచి చాలా సీక్వెల్స్ ఉన్నాయి అందులో ఇది కూడా అవసరమా అనే టాక్ లేకపోలేదు.
నిజానికి ఇపుడు ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాల్లో తక్కువ హైప్ దీని వైపే ఉంది. ఇదే తమకి కూడా కావాలని టీం అంటున్నారు. సినిమా తోనే ఆన్సర్ ఇస్తాం అంటున్నారు. మరి నిజంగానే దీనికి కూడా సీక్వెల్ అనేది ఉంటే పార్ట్ 1 డెఫినెట్ గా బిగ్గెస్ట్ హిట్ కావాల్సిందే అని చెప్పాలి. మరి దీనికి సీక్వెల్ ఉందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.
The post సీక్వెల్ కావాల్సిందేనా! first appeared on Andhrawatch.com.