ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘పుష్ప-2’ తో ఇండియన్ రికార్డులను తిరగరాశాడు దర్శకుడు సుకుమార్. ఆయన తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో సుకుమార్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఇక ఇప్పుడు అందరూ సుకుమార్ నుంచి రాబోయే నెక్స్ట్ మూవీ ఏమిటా అని ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఇప్పటికే సుకుమార్ తన నెక్స్ట్ చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో చేయబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక ఈ సినిమా కోసం సుకుమార్ తను ఫాలో అవుతున్న సెంటిమెంట్‌ను పక్కకుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనుండటంతో ఆ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్నను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట.
సుకుమార్ సాధారణంగా తన సినిమాల్లో హీరోయిన్‌ను రిపీట్ చేయడు. కానీ, చరణ్ కోసం సుకుమార్ ఇలా తొలిసారి తన సెంటిమెంట్ కాదని ఓ హీరోయిన్‌ని అలాగే కంటిన్యూ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే.. పుష్ప, పుష్ప-2 చిత్రాల్లో ఆమె పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన సుకుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.
The post సెంటిమెంట్ ను పక్కన పెడుతున్నారా?! first appeared on Andhrawatch.com.