నవ దళపతి సుధీర్ బాబు ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ అయ్యేలా చేశాయి.
ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుంచి విడుదల అయిన ఫస్ట్ సింగిల్ సాంగ్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. సెకండ్ సింగిల్ సాంగ్‌గా ‘వేడుకలో’ అంటూ సాగే వెడ్డింగ్ సాంగ్‌ను విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు.
ఈ పాటను సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు సరికొత్త లుక్‌తో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో షాయాజి షిండే, సాయి చంద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
The post సెకండ్ సింగిల్ అప్డేట్! first appeared on Andhrawatch.com.