టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ‘గేమ్ ఛేంజర్’ నే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఈ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది.కాగా, ఈ సినిమా విడుదలకు మరో పది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది మూవీ టీమ్. ఇక ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ముగిసినట్లు సమాచారం.
ఈ సినిమాకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినపడుతుంది. ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు గా ఉన్నట్లు మూవీ టీమ్ చెబుతుంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, అంజలి, ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
The post సెన్సార్ పనులు పూర్తయ్యాయోచ్! first appeared on Andhrawatch.com.