టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 29వ సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం మహేశ్ ప్రస్తుతం కొత్త లుక్‌ను ట్రై చేస్తున్నాడు. ఇక ఆయన ప్రస్తుతం తన ఫ్యామిలీకి సమయాన్ని వెచ్చిస్తున్నాడు.
ఈ క్రమంలో ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు ఆయన తన స్నేహితులకు కూడా సమయాన్ని ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకను జరిపి ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ పుట్టిన రోజు వేడుకలో ఆయన భార్య నమ్రత కూడా మెరిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో పెట్టగా..అవి వైరల్ అవుతున్నాయి.
ఇక మహేశ్ బాబు ప్రస్తుతం గుబురు గడ్డంతో పాటు లాంగ్ హెయిర్‌తో కనిపిస్తున్నాడు. ఆయన రాజమౌళితో చేయబోయే సినిమా అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కనుండటంతో, ఆ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది.
The post స్నేహితుని పుట్టినరోజు వేడుకల్లో మహేశ్! first appeared on Andhrawatch.com.