హమ్మాయ్య సాంగ్‌ వచ్చేసింది! | CineChitram

టాలీవుడ్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేసే నారా రోహిత్ నటిస్తున్నతాజా సినిమా ‘సుందరకాండ’ . ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని ఇప్పటికే క్రియేట్ చేసింది. ఈ సినిమాకి దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం చెబుతుంది.

ఇక ఈ సినిమా నుండి  విడుదల అయిన కంటెంట్ ప్రేక్షకుల్లో అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుండి ‘హమ్మయ్య’ అనే లిరికల్ పాటని తాజాగా మూవీ మేకర్స్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ పాట ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండేలా మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్‌ కంపోజ్ చేశాడు .

ఇక శ్రీహర్ష ఈమని అందించిన చక్కటి లిరిక్స్‌కి రామ్ మిర్యాల తన వాయిస్‌తో గొప్ప మ్యాజిక్ చేశాడు. ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై మరింత పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రీదేవి విజయ్ కుమార్ చాలా చక్కటి లుక్స్‌తో కనిపిస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

The post హమ్మాయ్య సాంగ్‌ వచ్చేసింది! first appeared on Andhrawatch.com.

About

Check Also

మామూలు ట్రెండింగ్‌ కాదిది! | CineChitram

మామూలు ట్రెండింగ్‌ కాదిది! టాలీవుడ్ దగ్గర ఈ సంక్రాంతి కానుకగా ప్లాన్ చేసిన సినిమాల్లో ఇప్పటికే రెండు ఆల్రెడీ విడుదలై పోయాయి. ఇక …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading