అందాల భామ సాయి పల్లవి నటించిన తాజా సినిమా ‘అమరన్’ ప్రస్తుతం థియేటర్లలో ఉంది. ఈ సినిమాలో హీరోగా శివకార్తికేయన్ నటించాడు. ఇక ఈ సినిమా తరువాత సాయి పల్లవి ఏ సినిమా చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే సాయి పల్లవి తన నెక్స్ట్ సినిమాగా ఓ తెలుగు మూవీని ఓకే చేసినట్లు సమాచారం.
టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’లో హీరోయిన్‌గా నటించేందుకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు
తాజాగా ‘లక్కీ భాస్కర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్, ఇప్పుడు మరో సినిమాను కూడా చిత్రీకరించేందుకు రెడీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది.
త్వరలోనే సాయి పల్లవి ఈ చిత్ర షూటింగ్‌లో జాయిన్ అవ్వనుందని సమాచారం. ఇలా తన నెక్స్ట్ సినిమాని కూడా సాయి పల్లవి ఓకే చేయడంతో ఆమె స్పీడు చూసి అభిమానులు ఆనందపడుతున్నారు.
The post హైబ్రిడ్ పిల్ల నెక్ట్స్ హీరో ఎవరో తెలుసా! first appeared on Andhrawatch.com.