పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ని తిరిగి స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఇంట్రో సీన్ అదిరిపోతుందని.. గజదొంగ పాత్ర పోషిస్తున్న పవన్, ఓ పడవలోకి ఎక్కిస్తున్న వజ్రాల్ని దొంగతనం చేయడానికొస్తాడట.
ఆ సమయంలో విజువల్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయట. ముఖ్యంగా పడవ ఓనర్ (మురళీ శర్మ)కు చెప్పి మరీ పవన్ దొంగతనం చేసే యాక్షన్ సీన్ అయితే, సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ అవుతుందని అంటున్నారు.
కాగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
The post హైలెట్ ఇదే! first appeared on Andhrawatch.com.