హ్యాపీ బర్త్‌ డే ఉపాసన! | CineChitram

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయించడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం ఆయన “పెద్ది” అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి షూటింగులు కొనసాగుతుండగా, తాజాగా ఆయన కుటుంబంతో కలిసి ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఇటీవల చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు రావడంతో, ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు రామ్ చరణ్ ప్రత్యేకంగా ప్లాన్ చేశాడు. ఇంట్లో అందమైన డెకరేషన్ మధ్య ఉపాసన బర్త్‌డే జరిపి, ఒక మధురమైన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఆ ఫోటోలో ఉపాసన ఆనందంగా కనిపిస్తుండగా, చరణ్ కూడా స్మైల్ తో ఉన్నాడు. మరింతగా ఆకర్షించిన విషయం ఏంటంటే, వారి పాప క్లింకారా కూడా ఆ ఫోటోలో ఉండటంతో అభిమానుల హృదయాలు గెలుచుకుంది. ఈ అందమైన క్షణాన్ని చూసిన వాళ్లు “పిక్ ఆఫ్ ది డే” అన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా చరణ్ పనిలో బిజీగా ఉన్నా, కుటుంబ వేళ్లకు ప్రాధాన్యత ఇచ్చే తీరుతో మరోసారి ఫ్యామిలీ మ్యాన్ గా తనని చాటుకున్నాడు.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …