117 మందితో మ్యూజిక్‌! | CineChitram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా ఓజిపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లు, పోస్టర్లు భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ముందుకు సాగుతోంది.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమా గురించి కొత్త సమాచారం షేర్ చేశాడు. ఆయన చెప్పినదాని ప్రకారం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్ వేగంగా కొనసాగుతోంది. లండన్‌లోని అబ్బీ రోడ్ స్టూడియోస్‌లో 117 మంది మ్యూజిషియన్స్‌తో ఈ రికార్డింగ్ వర్క్ జరుగుతోందని థమన్ వెల్లడించాడు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది.

థమన్ చూపుతున్న కష్టపాటు, డెడికేషన్‌ చూసి ఫ్యాన్స్ ఆనందపడుతూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …